రేవల్లి మండలం కేంద్రం లో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం ==గోపాల్పేట్ ఉమ్మడి మండలాల ఇన్చార్జి సత్య శీలా రెడ్డి, రేవల్లి మండల అధ్యక్షుడు వాడల పర్వతాలు
అక్షర విజేత గోపాల్పేట్, రేవల్లి;
వనపర్తి జిల్లా రేవల్లి మండలం కేంద్రం తో పాటు పలు గ్రామాలలో ఖరీఫ్(వానకాలం)(2025-26)వరి ధాన్యం కొనుగోలు కేంద్ర (ఐకేపీ) ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోఉమ్మడి గోపాల్ పేట కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి సత్యశీలా రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ రఘు యాదవ్, రేవల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాడల పర్వతాలు,నాగపూర్ ఇందిరమ్మ కమిటీ మెంబర్ దొడ్డి చెన్నకేశవులు, అలాగే సుధాకర్, సురేష్, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.